
డయల్ యువర్ ఈవో కార్యక్రమం శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. రవి – కావలి
ప్రశ్న : నేత్రదాన ట్రస్టును ప్రారంభించి అవసరమైన వారికి కార్నియా దానం చేయండి.
ఈవో : అరవింద ట్రస్టుతో ఒప్పందం చేసుకుని తిరుపతిలో నేత్ర వైద్య సేవలు అందిస్తున్నాం. వారితో చర్చించి ఐ బ్యాంకు ఏర్పాటుకు కృషి చేస్తాం.
2. అనిల్ కుమార్ – గోరంట్ల
ప్రశ్న : కాషన్ డిపాజిట్ రీఫండ్ కావడం లేదు.
ఈవో : కాషన్ డిపాజిట్ పై ఇటీవల ఎలాంటి ఫిర్యాదులు లేవు. మీతో చర్చించి రీఫండ్ అయ్యేలా చూస్తాం.
3. ప్రసాద్ – చీరాల
ప్రశ్న : 2009 నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన చేస్తున్నాం. మాకు నాదనీరాజన వేదికపై అవకాశం కల్పించండి.
ఈవో : ఎస్వీబిసి నిబంధనల మేరకు నాదనీరాజన వేదికపై అవకాశం కల్పిస్తాం.
4. శంకర్ – హైదరాబాద్
ప్రశ్న : విఐపి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయించడం తగ్గించండి. రూ.300/- దర్శన టికెట్లు రెండు నెలల ముందుగానే కేటాయించండి.
ఈవో : విఐపి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయించడం కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశం. వేసవి నేపథ్యంలో ఏప్రిల్ నెలలో రూ.300/- దర్శన టికెట్ల కోటా తగ్గించి మార్చి నెలలో విడుదల చేశాం. ఈ నెలలో మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను ఒకటేసారి విడుదల చేస్తాం.
5. శ్యామల – చెన్నై
ప్రశ్న : లడ్డూ టోకెన్ స్కాన్ కాకపోవడం వల్ల మాకు లడ్డూలు అందలేదు.
ఈవో : ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు కంపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన తరువాత లడ్డూ టోకెన్ జారీ చేస్తారు. దీన్ని క్యూలైన్ లో మరోసారీ స్కాన్ చేసుకున్న తర్వాత మాత్రమే లడ్డూలు పొందడానికి వీలవుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం.
6. కిరణ్ – తెనాలి
ప్రశ్న : తిరుచానూరులో రోడ్డుపై వాహనం నిలిపినా పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే దురుసుగా వ్యవహరిస్తున్నారు.
ఈవో : ఈ విషయాన్ని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తన చర్యలు తీసుకుంటాం.
7. గీత – విల్లివాక్కం
ప్రశ్న : నా భర్తకు 65 ఏళ్లు. మోకాలి నోప్పులు ఉన్నాయి. దర్శనానికి ఎలా రావాలి.
ఈవో : వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్ లైన్లో దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తున్నాం. వీటిని ఉచితంగా బుక్ చేసుకుని దర్శనానికి రావచ్చు. దగ్గర దారిలో దర్శనం కల్పిస్తాం. నడవలేని వారిని బయోమెట్రిక్ నుంచి దర్శనానికి పంపుతాం.
8. జగదీష్ – వేలూరు
ప్రశ్న : శుక్రవారం నాడు నిజపాద దర్శనం సేవను పునరుద్ధరించండి.
ఈవో : సామాన్య భక్తులకు ఎక్కువ మందికి స్వామివారి దర్శనభాగ్యం కల్పించడంతోపాటు స్వామివారి నైవేద్యం ఆలస్యం కాకుండా ఉండేందుకే శుక్రవారం రోజు జారీ చేస్తూ వచ్చిన నిజపాదదర్శనం సేవాటికెట్లను టిటిడి బోర్డు తాత్కాలికంగా రద్దు చేసింది.
9. సత్యశ్రీ – విజయనగరం, రాజ్యలక్ష్మి – గిండి
ప్రశ్న : తిరుమల దర్శనానికి వచ్చాం. ఆన్లైన్ లో శ్రీవారి సేవా టికెట్ ఇప్పిస్తామని దళారులు మోసం చేశారు.
ఈవో : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం. భక్తులు దళారుల బారిన పడకుండా వీటిని బుక్ చేసుకోండి.
10. చంద్రమౌళి – హైదరాబాద్
ప్రశ్న : ఆస్ట్రాలజి కోర్సు ప్రవేశపెట్టండి.
ఈవో : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆస్ట్రాలజీ మరియు అకల్ట్ సైన్సెస్ విభాగాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం.
11. లీలాసాగర్ – నెల్లూరు
ప్రశ్న : పిఎసి-2లో లాకర్ తీసుకున్నాం. పారిశుధ్యం సరిగా లేదు. బకెట్లు లేవు. వెంగమాంబ భవనంలో భోజనం నాణ్యత సరిగా లేదు. లడ్డూలు గట్టిగా ఉంటున్నాయి.
ఈవో : ఈ విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.
12. గోవర్ధన్ – జగిత్యాల
ప్రశ్న : తిరుమలలో లక్కీడిప్ లో ఆర్జిత సేవా టికెట్ వచ్చింది. అరగంట లేటుగా వెళ్ళినందుకు టికెట్ రద్దయింది. గూగుల్ పే ప్రవేశపెట్టండి. నడకదారిలో టికెట్ పొందితే కొండపై లక్కీడిప్ లో సేవలకు నమోదు చేసుకోవచ్చా.
ఈవో : లక్కీడిప్ లో సేవా టికెట్ పొందిన భక్తులు సొమ్ము చెల్లించేందుకు గూగుల్ పే, ఫోన్ పే విధానాన్ని ప్రవేశపెడతాం. నడకదారిలో దర్శన టికెట్ కు, లక్కీడిప్ లో సేవా టికెట్ కు ఎలాంటి సంబంధం లేదు.
13. సుబ్రహ్మణ్యం – కొత్తపల్లి
ప్రశ్న : తిరుచానూరు నుంచి అప్పలాయగుంటకు వెళ్లే దారిలో సూచిక బోర్డులు లేవు.
ఈవో : ఇక్కడ సూచిక బోర్డులు ప్రవేశపెట్టేందుకు ఆదేశాలు జారీ చేశాం.
14. చైతన్య – బెంగళూరు
ప్రశ్న : కళ్యాణిలో గది తీసుకున్నాం. గది కేటాయించిన అరగంట వరకు కూడా శుభ్రం చేయలేదు.
ఈవో : ఇది పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
15. అప్పన్న – విశాఖ
ప్రశ్న : శ్రీవారి సేవకులతో తిరునామం పెట్టించండి. విశాఖలోని ఆలయంలో అర్జిత సేవలకు భక్తులను అనుమతించండి. ఇక్కడ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదం అందించండి.
ఈవో : ఒక నెలలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తాం. శ్రీవారి లడ్డు ప్రసాదం, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపడతాం.
16. ఎర్ర మల్లయ్య – మదనపల్లి
ప్రశ్న : తిరుమలకు కాలినడకన వచ్చాము. క్యూలైన్లలో ఎక్కువ దూరం నడవాల్సి వస్తోంది. నడక మార్గంలో తాగునీటి వసతి కల్పించండి.
ఈవో : ఏప్రిల్ 1వ తేదీ నుంచి నడక మార్గంలో వచ్చే భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నాం. వీటిని పొందితే నిర్దేశిత సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. నడక మార్గాల్లో అవసరమైనచోట్ల తాగునీటి వసతి కల్పిస్తాం.
17. సరితా రెడ్డి – కరీంనగర్
ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆఫ్ లైన్లో కొన్ని ఇవ్వండి.
ఈవో : ఈ టికెట్లు పరిమితం కాబట్టి ఆఫ్ లైన్లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. భక్తుల కోరిక మేరకే ఆన్లైన్లో విడుదల చేస్తున్నాం.
18. అనిల్ కుమార్ – తాడిపత్రి
ప్రశ్న : అన్నప్రసాదాలు వృథా కాకుండా చూడండి.
ఈవో : భక్తులు అవసరమైన మేరకే వడ్డించుకుని అన్నప్రసాదాలు వృథా కాకుండా చూడాలని కోరుతున్నాం.
19. సుబ్రహ్మణ్యం – విజయవాడ
ప్రశ్న : వృద్ధులకు దర్శనం కోటాతో పాటు గదుల కోటా కూడా కేటాయించండి.
ఈవో : తిరుమలకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ వసతి పరిమితంగా ఉంది. తిరుపతిలో గదులు పొంది తిరుమల శ్రీవారి దర్శనానికి రావచ్చు.
20. శ్రీనివాస్ – విజయవాడ
ప్రశ్న : శ్రీవారి ఆలయంలో జరిగే కల్యాణోత్సవంలో భక్తులను ఇరుకుగా కూర్చోబెడుతున్నారు. ఇబ్బందిగా ఉంది.
ఈవో : భక్తుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ టికెట్లు కేటాయించడం వలన అలా జరుగుతోంది. ఇరుకుగా లేకుండా చర్యలు తీసుకుంటాం.
21. లీలాకృష్ణ – తిరుపతి.
ప్రశ్న : స్విమ్స్ లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వసతులు పెంచండి.
ఈవో : సిమ్స్ ఆసుపత్రిని ఆరు నెలల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం.
Leave a Reply